అలరాస అంటే ఏంటో నాకు తెలియదు. కథ చదివినా సుబ్బారాయుడు పద్మావతిని గోనలేరు లోకి తోసివేసాడా లేక పద్మావతి తనంతట తానే దూకిందో అర్థం కాలేదు(ఎవరికన్నా తెలిస్తే చెప్పరూ?). మిగతా కథలలో కూడా చాలా పదాలకి అర్థం తెలియలేదు. అయినా కూడా కల్యాణ సుందరీ జగన్నాథ్ కథలు ‘అలరాస పుట్టిళ్ళు’ నాకు ఎంత గానో నచ్చాయి. ‘సర్ప కంకణం’ కథ బాగా ఆశ్చర్య పరిచింది. అది వారు ఎప్పుడు రాసారో తెలియదు కానీ, అలాంటి కథలు ఇంకెవరన్నా రాసారేమో తెలియదు కానీ నాకు మాత్రం మొదటి సారిగా ఒక కొత్త తరహా కథ చదివిన అనుభూతి కలిగింది.
ఆగష్టు 8, 2009
జులై 24, 2009
దీపం
అన్ని అవయవాలు లక్షణంగా పనిచేస్తేనే మనకు కొన్ని పనులు చెయ్యడం కష్టంగా ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఒక సభ లో అంధ విద్యార్ధుల గురించి ఒక presentation చూసాను.ఒక అంధుడైన వ్యక్తి ఎంతో పట్టుదల తో నిధులు సరిపడా లేకున్నా ప్రభుత్వ సంస్థల కంటే ఎంతో ఉన్నతంగా అంధుల కోసం ఒక ప్రాధమిక పాఠశాలను నడుపుతున్నారు. 8 మందితో మొదలయ్యింది ఇప్పుడు 250 కి ఆశ్రయం ఇస్తోంది. అంధులను చూసి అవిటివాళ్ళు అని జాలి పడకుండా వాళ్ళకి సొంత కాళ్ళమీద నిలబడే ధైర్యం ఇస్తున్న ఆ సంస్థ మీద ఎంతో గౌరవము ఏర్పడింది.అక్కడి పిల్లల ప్రతిభా పాటవాలు చూస్తే ఎంతో ముచ్చటేసింది.ఆ సంస్థను నడిపే ఆయన ఆశయం గొప్పది , దానికి ఉడతా భక్క్తి గా మనం ఏదైనా సహాయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదు అనిపించింది. ఈ టపా ను చదివే వారికి నాదొక విన్నపం. ఈ లింక్ ను ఒకసారి చూడండి http://www.helpblind.org. మీకు తోచింది చెయ్యండి.ఇది చూసాక “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అన్న నానుడి కంటే అన్ని ధర్మ కార్యాలలోకి తమ స్వశక్తిని పెంపొందించే ఇలాంటి సంస్థలు చాలా అవసరం అనిపించింది.
తెలుగునాడి
పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?
నా వరకు నాకు తెలుగునాడి అమితంగా నచ్చింది. ఇక ముందు అది వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు తెలిసి అమెరికా లో అచ్చులో లభించే మంచి తెలుగు పత్రికలు ఏమన్నా వున్నాయా?
జులై 19, 2009
ద్రాక్షారం కథలు (హాస్య కథలు)
నా జీవితానంతరం మరికొన్నాళ్ళు నన్ను సజీవుడిగా ఉంచుతుందన్న సంకల్పంతో యీ సంకలనాన్ని సమర్పిస్తున్నాను అని ఫినిషింగ్ టచ్ లో చెప్పారు డా|| దవులూరి శ్రీకృష్ణ మోహన రావు గారు. కొన్నాళ్ళు కాదు చాన్నాళ్ళు అని నేనంటాను. ఈ కథలు చదివితే అందమైన పల్లెటూరికి వెళ్ళినట్టే అంటారు ఎల్బి. శ్రీరాం గారు. ఎంతో పరిచయం ఉండి – పరిసరాల్తోటి.. మనుష్యులతోటి మమేకం అయితే తప్ప ఇలాంటి కధలు పుట్టవు అంటారు తనికెళ్ళ భరణి గారు. సరదాగా నవ్విస్తూనే ఎంతో లోతుగా గోదావరి ప్రాంత జన జీవితాల్లోకి తొంగి చూస్తాయి ఈ కధలు. నన్నడిగితే పసలపూడి కధలకి ఏ మాత్రం తీసిపోవు ఈ ద్రాక్షారం కథలు. మరి ద్రాక్షారం కథలకి ఏ మాత్రం తీసిపోవు పసలపూడి కథలు అని ఎందుకు అనలేదు? పసలపూడి కథలు రాసింది వంశి కాబట్టి. ఆయన పెద్ద సినిమా డైరెక్టరు కాబట్టి. ఆ కథలు స్వాతి లో వచ్చాయి కాబట్టి. ఆ కథలు అందరికి తెలుసు కాబట్టి. ద్రాక్షారం కథలకి కూడా అంత వెలుగు రావాలని, అంతగా అమ్ముడు పోవాలని, రచయితకు అంత పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అంత మంచి కథలు చెప్పినందుకు నా కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
సూర్రావు వీలునామా ఎంత దిట్టంగా వుందో, చందర్రావు వీలునామా కూడా అంత దిట్టంగానే వుంది. అదే తేదీన వుంది.
సూర్రావు, చందర్రావులవి ఎదురిళ్ళు కనుక అరుగుల మీద నిలబడి నీది నకిలీ అంటే నీది నకిలీ అని తిట్టుకున్నారు.
మా కోమట్ల ఫైటింగులు ఎలా ఉంటాయంటే “ఇద్దరూ లమ్డీకొడుకులైపోతారు . అటు ఏడు తరాలు, యిటు ఏడు తరాలు నాసనమైపోతాయి, సొంత అన్నదమ్ములైనాసరే. పీకలు తెగిపోతాయి రక్తం ఏరులైపారుతుంది. కాళ్ళు మాత్రం వీధరుగులు దిగవు.
మే 4, 2009
నా తొలి టపా
‘నా ప్రస్థానం’ లో బాపు గారి బొమ్మల గురించి తొలి టపా రాయటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి నేను ఆయన బొమ్మలకు, సినిమాలకు అభిమానిని. ఎందుకో అన్ని చాలా సహజంగా అనిపించేవి. విజయవాడ లో ప్రతి సంవత్సరం పెట్టే పుస్తక ప్రదర్సన లో ఆయన బొమ్మల కొలువు కూడా ఉండేది. అది చూడడమంటేనే చాలా పండుగలా ఉండేది.మా బంధువుల ఇంట్లో ఆయన పైన్టింగ్స్ వి ప్రింట్స్ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. నాకు ఆ ప్రదేశమంతా తెలుగుతనం తో ఉన్నట్టు ఉండేది. నేను US వచ్చాక ఇల్లు చాల బోసిగా అనిపించేది.ఇంక లాభం లేదని ఆ ప్రింట్స్ కోసం ప్రయత్నించాము.అదృష్టవసాత్తు నాకు http://bapuart.com/ కనపడింది. ఇందులో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి కొంత సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది . విజయవాడ లోని impressions సంస్థ వారికి ఈ ప్రింట్స్ మీద హక్కులు ఉన్నాయి.ఒక వారాంతం వారికి ఫోన్ చేసి మాకు ఆ ప్రింట్స్ కావాలని అడిగిన వెంటనే వారు మాకు కావలిసిన బొమ్మల జాబితా ఇంకా కావలిసిన కొలత తెలియచేస్తూ impressionsoffice (at) yahoo [dot] co [dot] in కి ఒక సందేశం పంపమని చెప్పారు.మేము కొన్ని ప్రింట్స్ 30″x40″ (ఫ్రేమ్ లేకుండా) కావాలని సందేశం పంపాము.అన్ని సిద్ధం చేసి మా స్నేహితుడు ఇండియా వెళ్ళినప్పుడు ఆయనకు courier చేశారు, వీలుంటే విజయవాడ ఆఫీసు లో అయినా తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవి తీసుకు రావడానికి వీలుగా చక్కగా అమర్చి ఒక ట్యూబ్ లో ఉంచారు.అవి చాల సురక్షితంగా మాకు చేరాయి.ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది.ఇక్కడ అన్ని ఫ్రేమ్స్, మేము చూసినవి 27″X30″ కొలతలోనే ఉన్నాయి.అవి కాకుంటే ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది . బాగా ఆలోచించి ఆ ప్రింట్స్ ని బొమ్మ పాడవకుండా 27″X30″ కి కుదించి ఇక్కడ దొరికిన ఫ్రేమ్ లో మొత్తానికి చాల కష్టపడి బిగించాము. ఇంట్లో అవి తగిలించేసరికి ఇంటికి ఎంత కళ వచ్చిందో!!!! ఆ రోజు వచ్చిన స్నేహితులైతే అవి చూసి చాలా ఆనందపడ్డారు. తెప్పించుకునే ముందు మీకు దగ్గర లో వున్న క్రాఫ్ట్స్ స్టోర్ లో ఫ్రేమ్ ఎంచుకుని దానికి తగ్గ కొలతలో ప్రింట్స్ తెప్పించుకోండి.
మే 3, 2009
క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ బిల్ల్ ఆఫ్ రైట్స్
ఆ మధ్య ఒక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆరు నెలలు ఉచిత బాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫర్ అంటే ఇదేదో బానే వుంది కదా అని ఒక 2% కట్టి కొంత మొత్తం కొత్త కార్డ్ కి బదిలీ చేసా. ఆ తరువాత కొన్ని నాళ్ళకి ఒక వారాంతం స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్య బాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రస్తావన వచ్చినప్పుడు తను ఎందుకు ఏమిటో తెలియదు కాని ఒక సారి బదిలీ చేసినాక ఇక ఆ కార్డ్ వాడకూడదు అని చెప్పాడు. ఎందుకైనా మంచిది ఒక సారి నీ స్టేట్మెంట్ సరి చూసుకో అని చెప్పాడు. సరే కదా అని చూస్తే ఫైనాన్స్ ఛార్జ్ అని కొంత మొత్తం కట్టాలని వుంది అందులో. ఫోను చేస్తే అవతల పెద్ద మనిషి మీరు చేసిన కొనుగోళ్లకు అది వడ్డీ అన్నాడు. నేను చేసిన కొనుగోళ్లకు సరి పడా తిరిగి చెల్లించాను కదా అని నేను అంటే, నేను చెల్లించిన మొత్తం వడ్డీ తక్కువ వున్న బాకీ ఏదైతే వుందో దానికి జమ కడతామని, అది మొత్తం చెల్లించిన తరువాతే నేను కట్టినది ఎక్కువ వడ్డీ వున్న బాకీకి జమ చేస్తామని, అప్పటి వరకు చచ్చినట్టు వడ్డీ కట్టాల్సిందేనని చెప్పాడు. ఉదాహరణకు నేను ఒక ౩౦౦౦ బదిలీ చేసి ఒక ౩౦౦ కొనుగోలు చేశాను అనుకోండి, ౩౦౦౦ కట్టిన తరువాతే ౩౦౦ తీర్చగలను అన్న మాట. కొనుగోలు దారు జాగ్రత్త, ఉచితం అంటూ ఏమీ వుండదు లాంటి ఉపదేశాలు గుర్తు వచ్చి ఎక్కువ మాట్లాడకుండా ఫోను పెట్టేసాను (ఈ విషయం వారు నాకు ఇది వరకే చెప్పి వున్నారని అందుకు నేను అంగీకరించాను అని కూడా అన్నాడు!). అదృష్టవసాత్తూ చేతిలో డబ్బులు వుండటంతో మొత్తం కట్టేసాను.
ఇదంతా ఇక్కడ చెప్పటానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి నా లాంటి అమాయక చక్రవర్తుల (బుర్ర తక్కువ వెధవలు) ఎవరన్నా ఇది చదివి ఇలాంటి తప్పిదం చెయ్యకుండా వుంటారని. రెండు ఈ వార్తలు చూసి ఆనందం పట్టాలేకా -
At the urging of the president, the House amended the bill to mandate the disclosure on each credit card bill of the long-term costs of paying only the minimum balance. Another provision requires credit card issuers to apply payments over the minimum balance to the debt with the highest interest rate first. Both were accepted by voice vote.
Congress turns from bank bailouts to helping consumers
Bills, Fed rules on credit cards
Who is Complying With New Credit Card Rules? An Update
Credit Card Bill of Rights: Which cards are complying?
ఈ వార్తలు చూసి భయం వేసింది –
Credit Information Bureau (India) Limited
మే 2, 2009
సమ్మర్ 2007
చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. మొదట్లో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా, చివరలో కొంచెం సాగతీసినట్టు అనిపించినా, ముగింపు మింగుడు పడక పోయినా, మొత్తానికి చూడవలసిన చిత్రం. రంగ్ దే బసంతి అంత బాగా ఆడటానికి ఈ చిత్రం మరుగున పడిపోవటానికి కారణాలు ఏంటో. అషుతోష్ రాణా అద్భుతంగా నటించాడు. కేవలం ఆ ఒక్క పాత్ర కోసం అయినా ఈ చిత్రం చూడవచ్చు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో ఇంకేమన్నా మంచి చిత్రాలు వచ్చాయా? ఇంత తీవ్ర సమస్యని మీడియా ఎందుకు పట్టించుకోవటం లేదు? మారుతున్న ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో చిన్న రైతుకు స్థానం లేదా?
చిత్రం సమీక్ష ఇక్కడ.
PS: focus, highlight, ignore, neglect వీటికి తెలుగు పదాలు చెప్పరూ
ఏప్రియల్ 19, 2009
సలాం హైద్రాబాద్
చిన్నప్పుడు మా అమ్మగారు జై ఆంధ్రా ఉద్యమ నేపధ్యం లో బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసే వాళ్ళమని, పరీక్షలకు పుస్తకాలు పట్టుకెళ్ళి వ్రాసే వాళ్ళమని చెప్పిన జ్ఞాపకం. కానీ ఆ ఉద్యమం ఎందుకో ఏమిటో తెలియదు. లోకేశ్వర్ గారి సలాం హైద్రాబాద్ చదివిన తరువాత కొంచెం అవగాహనకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యాన్ని, అందులోని కీలక వ్యక్తుల్ని, పోరాట ఘట్టాల్ని, అప్పటి హైద్రాబాద్ ఛాయాచిత్రాన్ని మన ముందు వుంచుతారు రచయిత. కానీ ఎందు వల్లో ఉద్యమం నీరు కారి పోవటానికి కల కారణాలను రెండు పేజీల్లో తేల్చేశారు. అంత ఉధృతంగా సాగిన ఉద్యమం ఎందుకు తిరోగమనం పట్టాల్సి వచ్చింది? ఆ వివరాలు ఎక్కడైనా జాలం లో వున్నాయా? మలబారు పోలీసులు అంటే ఎవరు? మొత్తానికి హైద్రాబాద్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసినా పుస్తకం అసంపూర్తిగా, కలగా పులగంగా అనిపించింది.
జనవరి 7, 2009
అక్టోబర్ 8, 2008
రేగడి విత్తులు
రేగడి విత్తులు – తానా నవలల పోటీలో రూ. 1,20,000/- బహుమతి పొందిన తొలి నవల. వ్యవసాయం ఇతివ్రుత్తంగా సాగే ఈ కథలో అంతర్లీనంగా సాగే చిన్న కథలు – సఫలమైన ప్రేమ, విఫలమైన ప్రేమ, అత్త గారితో సర్దుకోలేని కోడలు, ఎవ్వరినీ లెక్క చేయని కొత్త కోడలు, కుటుంబం కోసం హారతి అయ్యే కొడుకు కోడలు, రాబంధువులు, దొరలు, దొంగలు, సారా, రాజకీయాలు. ఏవో కొన్ని తెలుగు నవలలు బహుశా ఈ పరిథిని దాటగలిగాయేమో. వ్యవసాయం గురించి తెలియని వారికి ఏమన్నా ఆసక్తికరంగా వుంటుందేమో కానీ తెలిసిన వారికి ఇది మరో తెలుగు నవల అంతే. ఒక నాటి గ్రామీణ జీవితాన్ని చక్కని సంభాషణలతో ఎలాంటి అసహజత్వం లేకుండా మన ముందు వుంచుతారు రచయిత్రి. ముద్రణా ప్రమాణాలు ముచ్చట పడే లాగ వున్నాయి. అన్ని పుస్తకాలు ఇంతే చక్కగా ముద్రితమైతే బాగుండును. తెలియని పదాలకు అర్థం కింద ఇవ్వటం నిజంగా మెచ్చుకోదగిన మార్పు.
తానా నవలల పోటీలో బహుమతి పొందిన మిగతా నవలల చిట్టా ఎక్కడైనా వుందా?
ఈ కింద వాటికి అర్థాలు తెలిస్తే ఎవరైనా చెప్ప మనవి -
ఆత్రగాళ్ళకి బుద్దిమట్టని ఊరికే అన్నారా
ఎంతకీ వగతెగదీ పని
ఆ ఆసాముల అయివేజులో వాటాలకు పోతామని గామాలి !
అంకిలి నొక్కుకుంది పున్నమ్మ
ఆరామడ పట్టనం అనుకుంటున్నాడో ఏవో
దో ఆబ్
వాఙ్మయ శ్రేణిందీర్చిన సత్కవీశ్వరులకున్
కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించు కంటె సత్కవుల్`హాలికులైన నేమి
నిక్కినాము
బెంచినార మీసలు రెండు బాసలకు మేమే కవీంద్రుల మంచదెల్పగా
కొనేడ్ది ఎనక సిక్కి !
మాసూలు చేసేటప్పుడు కల్లాం దగ్గర వుండమట్రా
All branches of Vishalandhra Book House
Navodaya Publishers, Eluru Road, Vijayawada, (0866) 573500, 574500
Prabhava Publications, 16-2-157, Pogathota, Nellore – 524 001
Phone: (0861) 2329567, 2323167
ABC Ashok Book Centre, Vijayawada, Ph: 2476966/2472096; Visakapatnam, Ph: 2565995
Akshara, Plot No. 46; Srinagar Colony, Hyderabad – 500074, Ph: 23736262








