అలరాస అంటే ఏంటో నాకు తెలియదు. కథ చదివినా సుబ్బారాయుడు పద్మావతిని గోనలేరు లోకి తోసివేసాడా లేక పద్మావతి తనంతట తానే దూకిందో అర్థం కాలేదు(ఎవరికన్నా తెలిస్తే చెప్పరూ?). మిగతా కథలలో కూడా చాలా పదాలకి అర్థం తెలియలేదు. అయినా కూడా కల్యాణ సుందరీ జగన్నాథ్ కథలు ‘అలరాస పుట్టిళ్ళు’ నాకు ఎంత గానో నచ్చాయి. ‘సర్ప కంకణం’ కథ బాగా ఆశ్చర్య పరిచింది. అది వారు ఎప్పుడు రాసారో తెలియదు కానీ, అలాంటి కథలు ఇంకెవరన్నా రాసారేమో తెలియదు కానీ నాకు మాత్రం మొదటి సారిగా ఒక కొత్త తరహా కథ చదివిన అనుభూతి కలిగింది.
ఆగష్టు 8, 2009
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI









అల అంటే అక్కడి అన్న అర్ధం వస్తుంది. అల వైకుంఠ పురంబులో అన్నట్తు. రాస అంటే, రాచ, రాజరికానికి సంబంధించిన, ఠీవియైన అని నేను అనుకున్నా. అలరాసపుట్టిళ్ళు = అక్కడి గంభీరమైన పుట్టిల్లు అనుకున్నా. కళ్యాణ సుందరీ జగన్నాధ్ గారిది ఇది కాక నేను ఇంకొకటి మాత్రమే చదివా, మాడంత మబ్బు. రెండూ అద్భుతంగా నచ్చినై. ఆ సందిగ్ధ పరిస్థితే మనకు వెన్ను జలదరింప చేసి కథ ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేస్తుంది.
వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — ఆగష్టు 8, 2009 @ 3:39 అపరాహ్నం |
ధన్యవాదాలు కొత్త పాళీ గారు. మాడంత మబ్బు తెప్పించుకుని చదవటానికి ప్రయత్నిస్తాను.
వ్యాఖ్య ద్వారా leo — ఆగష్టు 10, 2009 @ 12:50 పూర్వాహ్నం |