ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్


నా చిన్నప్పుడు (ఎప్పుడో గుర్తు లేదు కానీ బడి పాత ఆవరణలో వున్నప్పుడు) బడిలో ఒక చిన్న గదిలో గ్రంధాలయం వుండేది. అక్కడ మొదటి సారిగా ఈ పుస్తకాన్ని చూసిన గుర్తు. పుస్తకం అట్ట మీద వున్న బొమ్మ చూసి రెండు నగరాల మధ్య యుద్ధం కథ అని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఆ పుస్తకం నేను అప్పట్లొ ఎందుకు  సంపాదించలేకపోయానొ, బడిలొ గ్రంధాలయం ఎప్పుడు మూసివేయబడిందొ నాకు గుర్తు లేదు. ఎప్పటికైనా చదవాలి అనుకుంటూ వుండే వాడిని. ఆ మధ్య ఒక సారి ఈబుక్ దొరికితే చదవటం మొదలు పెట్టాను కానీ అంత ఆసక్తికరంగా అనిపించక మధ్యలొ ఆపేసాను. మళ్ళీ మొన్న గ్రంధాలయంలో కనపడితే ఈ సారి ఎమైనా సరే పూర్తిగా చదవాలని తెచ్చుకుని పట్టుదలగా చదివేసాను.

ఫ్రెంచి విప్లవ నేపధ్యంలొ నడుస్తుంది కథ. రచయిత డికెన్స్ కథ కన్నా విప్లవానికి కారణమైన పరిస్థితులను, విప్లవం పేరుతో జరిగిన మారణకాండను చెప్పటానికే ప్రాధాన్యత యిచ్చినట్టు అనిపించింది నాకు. ముగింపు ఊహించని మలుపులతో బాగుంది. కానీ విప్లవ నేపధ్యం వున్న పుస్తకం, సంగ్రహించబడినా, పిల్లల పుస్తకాలయంలో ఎలా వుందా అనేది ఆశ్చర్యంగా వుంది.

Advertisements

మన జీవితాలు


కాలేజిలో వున్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయి, పరీక్షల నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది, ఉద్యోగంలో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం. ఉద్యోగ వేటలో నానా తిప్పలు పడి కనపడిన ప్రతి సంస్థ ఇంటర్వ్యుకి వెళ్ళి, నానా కష్టాలు పడి ఉద్యోగం సంపాదిస్తాం.

ఉద్యోగంలో చేరామా ….

మొదటి నెల – పని ఉండదు.కాలక్షేపం మాత్రమే – ఆల్ హాప్పీస్
రెండో నెల – పని + కాలక్షేపం
మూడో నెల – కేవలం పని
సమస్య షురూ.

అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.
పక్క టీం లొ మేనేజరు మంచోడు అయిఉంటాడు.
పక్క టీం లొ అమ్మాయిలు బావుంటారు.
పక్క టీం లొ జీతాలు బాగా పెంచుతారు.
పక్క టీం లొ పని అసలే ఉండదు.
మనకి మాత్రం రోజూ పండుగ.

చేసిన పనికి చెయ్యని పనికి దొబ్బించుకోవటమే. ఒక్కో క్లైంటేమొ పిచ్చి రిక్వైర్మెంట్స్ యిస్తాడు. అవి పని చెయ్యవు అని తెలిసి అలానే చెయ్యాలి. అర్ధ రాత్రి సప్పోర్టులు. ఆన్సైట్ వాడిని అమ్మ నా బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది. కాని ఆఫీసు లొ నెట్ ఫ్రీ, కాఫీ ఫ్రీ అనే ఆలొచన ఆపేస్తుంది. మనకి ఒక బాచ్ తయారవుతుంది.

ఇలా లూప్ లొ పెట్టి కొడితే రెండు యేండ్లు అయిపోతాయి. అప్పటికి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, వేళ్ళు వంకర్లు, మెడ నొప్పులు . . . పిచ్చి నా జబ్బులు అన్నీ వచ్చేసి ఉంటాయి. సొంత అమ్మా, నాన్నా, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు నే చుట్టం చూపు గా చూడటానికి వెళ్తుంటాం. వాళ్ళు సాఫ్ట్‌వేర్ రంగం లొ ఉంటే అర్ధం చేసుకుని తిట్టటం మానేస్తారు. అలా లేకపోతే ఫోను చేసిన ప్రతి సారి సంజాయిషీ చెప్పుకోవాలి.

జీతం పడుతూ ఉంటుంది. బాండ్స్ కి అని, ఫండ్స్ కి అని, క్రెడిట్ కార్డ్ బిల్లు కి అని కట్టి కట్టి సంపాదించింది అంతా ధార పోస్తాం. ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు ఐతే హొంలోన్ మీద, మనలాంటోడు ఐతే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం.

ఇలా జీవితం ప్రసాంతంగా సాగుతూ ఉండగా ఒక రోజు ఏదో ఒక పాత సహొద్యోగి / సహొద్యోగి పెళ్ళి కుదిరింది అని పిలుస్తాడు. మనకి ఒక అమ్మయి ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది. మన సాఫ్ట్‌వేర్ రంగంలొ బావున్న అమ్మయిలు అంతా బుక్డ్, మారీడ్ ఆర్ నార్త్ ఇండియన్స్ అయి ఉంటారు. అక్కడే వంద లొ 95 మంది ఫిల్టర్ అయిపోతారు.  మిగతా ఐదు లొ 4 మంది ని “స్నేహితురాలు” కంటే అక్కా అని పిలవటం నయం అనేటట్టు ఉంటారు. ఆ మిగిలిన ఒక్క అమ్మాయి కోసం టీం అంతా ఊర కుక్కల్లా కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయి యెవరితోను కమిట్ అవ్వకుండా అందరితో ఫ్రీగా బతికేస్తు ఉంటుంది. ఒక మంచి రోజు  పెళ్ళి కార్డు యిస్తుంది. ఇంకేముంది. వచ్చే వారాంతం ఒక సిట్టింగ్. ఆ అమ్మాయి మంచిది కాదు అని డిసైడింగ్. మరుసటి రోజు నుంచి ఇంకొకల్లకి బీటు వెయ్యటం.

రెవ్యూస్ వస్తాయి. “నువ్వు ఎక్సల్లెంట్, నువ్వు లేనిదే కంపెనీ లేదు, కత్తి , అది, ఇది . . . ” అని చెప్పి ఊరించి చివర్లో “కానీ” అంటారు. తీరా చూస్తే నీ జీతం లొ యింకొ సెనక్కాయ్ పెంచాం పో అంటారు. రెస్యుమే అప్డేట్ చెయ్యాలి అని గత ఆరు నెలలు గా తీసుకుంటున్న నిర్ణయం ని మళ్ళా ఒక సారి స్మరించుకుని అలా ఇచ్చిన సెనక్కాయల మీద బతికేస్తుంటాం.

జీవితం అంటే దూరదర్సన్ లొ హైదరబాద్ ప్రసారం లా నే ఉంటుందా వేరే ప్రొగ్రాములు ఏమీ  ఉండవా!!!

గమనిక: ఇది నా సొంత రచన కాదు. స్నేహితుడు పంపిన ఈమైల్ తెలుగులొకి మార్చటం జరిగింది.