పాలగుమ్మి సాయినాథ్


నేను మామూలుగా గూగుల్ న్యూస్, కూడలి, బ్లాగ్స్ చూసి ప్రపంచంలో ఏమి జరుగుతోందో తెలుసుకుంటూ వుంటాను. ఎప్పుడో హిందు తప్ప మరే దినపత్రిక చదవను. అయినా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ తెలుసుకుంటున్నానులే అని ఒక ధీమా. అలాంటిది ఒక భారతీయుడుకి, అందునా ఒక తెలుగు వారికి ఈ సంవత్సరం రామన్ మెగసెసె అవార్డు వచ్చిందని యివ్వాళే చూసి, యింత మంచి సంగతి ఎలా మిస్ అయ్యానా అని కొంచెం కలత చెందాను.

పాలగుమ్మి సాయినాథ్ పత్రికా విలేఖరిగా గ్రామీణ పేదలకు ప్రాతినిధ్యం వహించి, వారి కష్టాలను మైన్ స్ట్రీం మీడీయా ద్రుష్టికి తెచ్చి దేశం స్పందించేలా చేసినందుకు ఈ సంవత్సరం రామన్ మెగసెసె అవార్డుతో సత్కరింప బడ్డారు. వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, దళితులపై అత్యాచారాలు వెలుగులోకి తేవటంలో విశేష క్రుషి చేసారు. అయిదు రాష్ట్రాలలోని పది అతి పేద జిల్లాలలో జీవన ప్రమాణాలను నివేదించటానికి చేసిన ప్రయాణంలో భాగంగా 5000 కిలో మీటర్లు కాలి నడకన పర్యటించారు! పత్రికలు ఆర్థిక సహాయము ఇంక ఇవ్వలేము అన్నప్పుడు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారు!

తను నష్టపోతూ ఆహారాన్ని పండిస్తున్న రైతుకి తప్పక సబ్సిడీలు యివ్వాలి అంటారు సాయినాథ్ గారు. సబ్సిడీలు ఎత్తివేయటం కంటే విద్య, వైద్య, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మీద ద్రుష్టి పెడితే గ్రామీణ భారతంలో ఎన్నో ఉద్యోగాలు స్రుష్టించటమే కాకుండా పురోగతి సాధించ వచ్చు అంటారు. ప్రస్తుతం వారు గ్రామీణ భారతానికి ఒక ఆర్కైవ్, ఇప్పటికి బ్రతికి వున్న స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకాలకు ఒక ఆర్కైవ్ స్రుష్టించే పనిలో వున్నారు.

సాయినాథ్ గారి గురించి మరిన్ని వివరాలకు యిక్కడ మరియు యిక్కడ చూడండి.

వారి రచనలు చాలా వరకు యిక్కడ వున్నాయి.

Advertisements

6 thoughts on “పాలగుమ్మి సాయినాథ్

  1. సాయినాథ్ గురించి నేనే ఒక టపా రాద్దామనుకుంటూ తాత్సారమైపోయింది 😦 మీరు పరిచయం చేసి మంచి పని చేశారు. పనిలోపని ఇండియాటుగెదర్ ని కూడా పరిచయం చేశారు.
    సాయినాథ్ హిందూ పత్రిక కి పనిచేస్తుండగా రాసిన వ్యాసాల సంకలనం – Everybody loves a good drought – మనదేశంలో ప్రజల అభివృద్ధిని గురించి ఆరాటపడే ప్రతి ఒక్కరూ చదవ వలసిన పుస్తకం.

  2. ఇండియాటుగెదర్ ఒక సంవత్సరం నుండి చూస్తున్నాను అండీ. మీడియా వార్తలు స్రుష్టిస్తున్న ఈ రోజుల్లో, గ్రాస్ రూట్స్ జర్నలిజం ప్రోత్సహించే యిలాంటి సంస్థల ఆవశ్యకత ఎంతైనా వుంది. విరాళం యిచ్చినచో ఆ నెల అచ్చైన వ్యాసాలు అన్నీ కలిపి ఒక పిడియఫ్ ఫైలుగా మైలుబాక్సుకి పంపిస్తారు.

  3. ధన్యవాదాలు నాగరాజా గారు. చిన్న సవరణ. జర్నలిజం,సాహిత్యం మరియు కమ్యూనికేషన్ రంగాలలో చాలా మంది భారతీయులకు ఈ పురస్కారం లభించింది.
    http://en.wikipedia.org/wiki/List_of_Magsaysay_awardees#Journalism.2C_Literature.2C_and_the_Creative_Communication_Arts

  4. సాయినాథ్ వ్యాసాలని హిందూ లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాను…
    ఇటీవలే నా స్నేహితురాలు ఆయన రాసిన Everybody loves a good drought గురించి చెప్పింది… అది కాస్త తీరిక దొరగ్గానె మొదలుపెట్టాలి అన్న ప్రయత్నం లో ఉన్నాను… నా సీనియర్ వద్ద చూసాక.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s