అము


Amu Poster

జమన్‌లో ఈ సినిమా గురించి చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఒక పక్క భారత ప్రభుత్వంచే సెన్సార్ చేయబడి, టి.వి లో ప్రదర్సన నిషేధింపబడిన సినిమా అంటూ, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నదని వుంది. ఇది ఎలా సాధ్యం అయ్యిందా అన్న కుతూహలంతో అద్దెకు తీసుకుని చూసాను. అమెరికా లో పెరిగిన కాజు ఢిల్లిలో తన బాల్య జ్ణాపకాల కోసం, అసలైన తల్లి తండ్రుల కోసం చేసే అన్వేషణ అము. 1984 సిక్కు ఊచకోతలు జాతి స్మ్రుతిపధం నుండి తొలగిపోకూడదని షొనాలి బోస్ చేసిన ప్రయత్నం అము.ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని సాక్ష్యాలు వున్నా న్యాయం జరగలేదని గుర్తు చేసే ప్రయత్నమే అము. ఓటరు జాబితాల సాయంతో మారణ కాండను సాగించిన రాజకీయ నాయకులు, చూస్తూ ఊరుకుండిపోయిన పోలీసులు, రౌడీ మూకల బారి నుండి తోటి సిక్కులను కాపాడటానికి ఇతర వర్గాల ప్రజలు చేసిన ప్రయత్నాలు అన్నింటినీ తెరకెక్కించారు దర్శకురాలు. కొంకణా సేన్ మరొకసారి అద్భుతంగా నటించగా, బ్రిందా కరాత్ మొదటి సారి తెర మీద కనపడతారు.

ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు నన్ను తీవ్రంగా కలవర పరిచాయి. ఒక సన్నివేశంలో కొడుకు తన తల్లిని బీర్ ఆర్డర్ చెయ్యమంటాడు. మరొక సన్నివేశంలో అమ్మమ్మ తన మనవరాలికి ఇప్పుడు కాకపొతే తన వయసు వచ్చాక వుంటాడా బాయ్ ఫ్రెండు అని అంటుంది. మరొక సన్నివేశంలో అంతర్జాలం వాడుతున్న కొదుకుతో నువ్వు ఏమి చేస్తున్నవో నాకు తెలుసు టేక్ యువర్ ఓన్ టైం అంటాడు తండ్రి. కాలం మారుతోందా, విలువలు దిగజారుతున్నాయా?

Advertisements