రమణీయం


రమణీయం

నేనైన నీకు నీవైన నేను అంటూ మొదలయ్యే ఈ పుస్తకం లోని కథల్లో బావా మరదళ్ళ నుండి, భార్యా భర్త, తల్లి తండ్రి, తాతయ్య మామ్మ అయ్యే వరకు ఒక జంట చేసే ప్రస్థానం మన ముందు వుంచుతారు రచయిత. వివాహ వ్యవస్థ మీద నాకు అంత సదభిప్రాయం లేదు. సంవత్సరాలు గడిచినా సంతోషంగా, సరదాగా వున్న జంటలని నేను పెద్దగా చూడలేదు. బహుశా బాధ్యతల బరువు వూపిరి పీల్చుకోనివ్వదేమో. కానీ ఈ కథలు చదివాక పెళ్ళి చేసుకుని కూడా సంతోషంగా వుండచ్చేమో అని మొదటి సారి అనిపించింది. భార్యా భర్తలుగా మిగిలిపోనక్కర లేదు స్నేహితులుగా వుండచ్చేమో అనిపించింది. రామం సీత లా, సీతా రాముడి లా ఒకరికి ఒకరయి ప్రయాణం సాగిస్తే దాంపత్య జీవితం స్వర్గం కదా. సాధారణంగా ఒక ఇదేల్ స్చెనరిఒ ని ఎవరన్నా ప్రెసెంట్ చేస్తే ఒక రకమైన అపనమ్మకంతో స్వీకరిస్తాను నేను. కానీ ఈ కథల్లోని స్వచ్చత, ఇద్దరి మధ్య వున్న ప్రేమను చెప్పిన విధానం నిరాశావాదినైన నన్నే కదిలించాయి. ఎందుకో ఇవి కథలు కావు నిజాలు అనిపించాయి. ఇంతకీ ఎవరు ఈ అనామకుడు. ఆయనతో కథలు రాయించిన ఆ అనామకురాలు ఎవరు? మిగతా కథల తో సంబంధం లేని ఏకపత్నీవ్రతం కథ ఈ సంకలనం లో ఎందుకు చేర్చబడింది?

ఇంతకీ పెళ్ళి చేసుకొని ఇంకా సంతోషంగానే వున్న వాళ్ళు ఎవరైనా వుంటే ఒక వ్యాఖ్య రాయండి కింద.

ఈ పుస్తకం, మరెన్నో మంచి పుస్తకాల గురించి తెలియచేస్తున్న బ్లాగరులందరికీ ధ్యన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

Advertisements