రేగడి విత్తులు


రేగడి విత్తులు – తానా నవలల పోటీలో రూ. 1,20,000/- బహుమతి పొందిన తొలి నవల. వ్యవసాయం ఇతివ్రుత్తంగా సాగే ఈ కథలో అంతర్లీనంగా సాగే చిన్న కథలు – సఫలమైన ప్రేమ, విఫలమైన ప్రేమ, అత్త గారితో సర్దుకోలేని కోడలు, ఎవ్వరినీ లెక్క చేయని కొత్త కోడలు, కుటుంబం కోసం హారతి అయ్యే కొడుకు కోడలు, రాబంధువులు, దొరలు, దొంగలు, సారా, రాజకీయాలు. ఏవో కొన్ని తెలుగు నవలలు బహుశా ఈ పరిథిని దాటగలిగాయేమో. వ్యవసాయం గురించి తెలియని వారికి ఏమన్నా ఆసక్తికరంగా వుంటుందేమో కానీ తెలిసిన వారికి ఇది మరో తెలుగు నవల అంతే.  ఒక నాటి గ్రామీణ జీవితాన్ని చక్కని సంభాషణలతో ఎలాంటి అసహజత్వం లేకుండా మన ముందు వుంచుతారు రచయిత్రి. ముద్రణా ప్రమాణాలు ముచ్చట పడే లాగ వున్నాయి. అన్ని పుస్తకాలు ఇంతే చక్కగా ముద్రితమైతే బాగుండును. తెలియని పదాలకు అర్థం కింద ఇవ్వటం నిజంగా మెచ్చుకోదగిన మార్పు.
తానా నవలల పోటీలో బహుమతి పొందిన మిగతా నవలల చిట్టా ఎక్కడైనా వుందా?
ఈ కింద వాటికి అర్థాలు తెలిస్తే ఎవరైనా చెప్ప మనవి –

ఆత్రగాళ్ళకి బుద్దిమట్టని ఊరికే అన్నారా
ఎంతకీ వగతెగదీ పని
ఆ ఆసాముల అయివేజులో వాటాలకు పోతామని గామాలి !
అంకిలి నొక్కుకుంది పున్నమ్మ
ఆరామడ పట్టనం అనుకుంటున్నాడో ఏవో
దో ఆబ్
వాఙ్మయ శ్రేణిందీర్చిన సత్కవీశ్వరులకున్
కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించు కంటె సత్కవుల్`హాలికులైన నేమి
నిక్కినాము
బెంచినార మీసలు రెండు బాసలకు మేమే కవీంద్రుల మంచదెల్పగా
కొనేడ్ది ఎనక సిక్కి !
మాసూలు చేసేటప్పుడు కల్లాం దగ్గర వుండమట్రా

All branches of Vishalandhra Book House
Navodaya Publishers, Eluru Road, Vijayawada, (0866) 573500, 574500
Prabhava Publications, 16-2-157, Pogathota, Nellore – 524 001
Phone: (0861) 2329567, 2323167
ABC Ashok Book Centre, Vijayawada, Ph: 2476966/2472096; Visakapatnam, Ph: 2565995
Akshara, Plot No. 46; Srinagar Colony, Hyderabad – 500074, Ph: 23736262

Advertisements

చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు


సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు ముందు మాటలో చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు గురించి తెలిసింది. చిన్న పరిశ్రమలలో వుండే పెద్ద కష్టాలను సున్నితమైన హాస్యం రంగరించి మన ముందు వుంచుతారు రచయిత్రి. ఇల్లేరమ్మ కథలకు యే మాత్రం తీసిపోని కథలు ఇవి. చివరలో ఎవరో అన్నట్టు 12 కథలు మాత్రమేనా. మరెన్నో మంచి కథలు చెబుతారని ఆశగా ఎదురు చూస్తూ……

Uma Books

58 – Krishna Reddy Nagar

New Bowenpally

Secunderabad – 500 011

Tel. 3078309, 7752358