రేగడి విత్తులు


రేగడి విత్తులు – తానా నవలల పోటీలో రూ. 1,20,000/- బహుమతి పొందిన తొలి నవల. వ్యవసాయం ఇతివ్రుత్తంగా సాగే ఈ కథలో అంతర్లీనంగా సాగే చిన్న కథలు – సఫలమైన ప్రేమ, విఫలమైన ప్రేమ, అత్త గారితో సర్దుకోలేని కోడలు, ఎవ్వరినీ లెక్క చేయని కొత్త కోడలు, కుటుంబం కోసం హారతి అయ్యే కొడుకు కోడలు, రాబంధువులు, దొరలు, దొంగలు, సారా, రాజకీయాలు. ఏవో కొన్ని తెలుగు నవలలు బహుశా ఈ పరిథిని దాటగలిగాయేమో. వ్యవసాయం గురించి తెలియని వారికి ఏమన్నా ఆసక్తికరంగా వుంటుందేమో కానీ తెలిసిన వారికి ఇది మరో తెలుగు నవల అంతే.  ఒక నాటి గ్రామీణ జీవితాన్ని చక్కని సంభాషణలతో ఎలాంటి అసహజత్వం లేకుండా మన ముందు వుంచుతారు రచయిత్రి. ముద్రణా ప్రమాణాలు ముచ్చట పడే లాగ వున్నాయి. అన్ని పుస్తకాలు ఇంతే చక్కగా ముద్రితమైతే బాగుండును. తెలియని పదాలకు అర్థం కింద ఇవ్వటం నిజంగా మెచ్చుకోదగిన మార్పు.
తానా నవలల పోటీలో బహుమతి పొందిన మిగతా నవలల చిట్టా ఎక్కడైనా వుందా?
ఈ కింద వాటికి అర్థాలు తెలిస్తే ఎవరైనా చెప్ప మనవి –

ఆత్రగాళ్ళకి బుద్దిమట్టని ఊరికే అన్నారా
ఎంతకీ వగతెగదీ పని
ఆ ఆసాముల అయివేజులో వాటాలకు పోతామని గామాలి !
అంకిలి నొక్కుకుంది పున్నమ్మ
ఆరామడ పట్టనం అనుకుంటున్నాడో ఏవో
దో ఆబ్
వాఙ్మయ శ్రేణిందీర్చిన సత్కవీశ్వరులకున్
కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించు కంటె సత్కవుల్`హాలికులైన నేమి
నిక్కినాము
బెంచినార మీసలు రెండు బాసలకు మేమే కవీంద్రుల మంచదెల్పగా
కొనేడ్ది ఎనక సిక్కి !
మాసూలు చేసేటప్పుడు కల్లాం దగ్గర వుండమట్రా

All branches of Vishalandhra Book House
Navodaya Publishers, Eluru Road, Vijayawada, (0866) 573500, 574500
Prabhava Publications, 16-2-157, Pogathota, Nellore – 524 001
Phone: (0861) 2329567, 2323167
ABC Ashok Book Centre, Vijayawada, Ph: 2476966/2472096; Visakapatnam, Ph: 2565995
Akshara, Plot No. 46; Srinagar Colony, Hyderabad – 500074, Ph: 23736262

Advertisements

3 thoughts on “రేగడి విత్తులు

 1. good show.
  From what I know:
  ఆ ఆసాముల అయివేజులో వాటాలకు పోతామని గామాలి !
  అయివేజు అంటే కౌలుదారు పొలం హక్కుదారుకి చెల్లించే మొత్తం (రొక్కం గానీ, ఫలసాయం కానీ)
  ఆరామడ పట్టనం అనుకుంటున్నాడో ఏవో
  ఆమడ అనేది దూరం కొలిచే ఒక యూనిట్టు. సరిగ్గా ఎంతో తెలీదు. ఆరామడల వ్యాసం ఉన్న పట్టణం అంటే బాగా విశాలమైన (పెద్ద) ఊరు అని కావచ్చు

  కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించు కంటె సత్కవుల్`హాలికులైన నేమి
  ఇది పోతన భాగవతంలో నాంది లో చెప్పిన పద్యం, తన కావ్యాన్ని రాముడికే తప్ప మానవ రాజులకి అంకిత మివ్వననీ, అలా ఇస్తే అది తన కవితా కన్యని తార్చినట్లని, ఆ పడుపు కూడు తినడంకంటే తాను నాగలి పట్టి పెళ్ళాం బిడ్డల్ని పోషించడం ఉత్తమ మనీ భావం.
  నిక్కినాము = నిలబడినాము కావచ్చు. నిక్కటం అంటే పైకి పొడుచుకు రావడం.
  బెంచినార మీసలు రెండు బాసలకు మేమే కవీంద్రుల మంచదెల్పగా
  తిరుపతి వేంకటకవులలో ఒకరికి (బహుశా చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారికి) చిన్న వయసులో మిసాలుండేవి. వైదీకులకి మీసాలుండవచ్చా అని ఎవరో ఎద్దేవా చేస్తే వారికి సమాధానం చెప్పిన పద్యంలోది ఈ పాదం, సంస్కృతంధ్రాల్లో మేమే కవులమని మా కవితా పౌరుషానికి చిహ్నంగా మీసం పెంచామని భావం
  మాసూలు చేసేటప్పుడు కల్లాం దగ్గర వుండమట్రా
  మాసూలు (బహుశా ఏదన్నా ఉర్దూ పదానికి అపభ్రంశ రూపం కావచ్చు)అంటే కుప్ప నూర్పిళ్ళు. వరి పండినాక ముందు కోసి, కోసిన కంకుల్ని కుప్ప వేస్తారు. ఒక రోజు మంచి రోజు చూసుకుని తగిన కూలీల్ని ఏర్పాటు చేసుకుని కుప్ప నూరుస్తారు.అంటే కంకుల్నించి వడ్ల గింజల్ని వేరు చెయ్యటం. దీంట్లో చాలా తతంగం ఉంటుంది. ఆ నూర్చే స్థలాన్ని కళ్ళం అంటారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s