సలాం హైద్రాబాద్


చిన్నప్పుడు మా అమ్మగారు జై ఆంధ్రా ఉద్యమ నేపధ్యం లో బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసే వాళ్ళమని, పరీక్షలకు పుస్తకాలు పట్టుకెళ్ళి వ్రాసే వాళ్ళమని చెప్పిన జ్ఞాపకం. కానీ ఆ ఉద్యమం ఎందుకో ఏమిటో తెలియదు. లోకేశ్వర్ గారి సలాం హైద్రాబాద్ చదివిన తరువాత కొంచెం అవగాహనకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యాన్ని, అందులోని కీలక వ్యక్తుల్ని, పోరాట ఘట్టాల్ని, అప్పటి హైద్రాబాద్ ఛాయాచిత్రాన్ని మన ముందు వుంచుతారు రచయిత. కానీ ఎందు వల్లో ఉద్యమం నీరు కారి పోవటానికి కల కారణాలను రెండు పేజీల్లో తేల్చేశారు. అంత ఉధృతంగా సాగిన ఉద్యమం ఎందుకు తిరోగమనం పట్టాల్సి వచ్చింది? ఆ వివరాలు ఎక్కడైనా జాలం లో వున్నాయా? మలబారు పోలీసులు అంటే ఎవరు? మొత్తానికి హైద్రాబాద్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసినా పుస్తకం అసంపూర్తిగా, కలగా పులగంగా అనిపించింది.

Advertisements