నా తొలి టపా


‘నా ప్రస్థానం’ లో బాపు గారి బొమ్మల గురించి తొలి టపా రాయటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి నేను ఆయన బొమ్మలకు, సినిమాలకు అభిమానిని. ఎందుకో అన్ని చాలా సహజంగా అనిపించేవి. విజయవాడ లో ప్రతి సంవత్సరం పెట్టే పుస్తక ప్రదర్సన లో ఆయన బొమ్మల కొలువు కూడా ఉండేది. అది చూడడమంటేనే చాలా పండుగలా ఉండేది.మా బంధువుల ఇంట్లో ఆయన పైన్టింగ్స్ వి ప్రింట్స్ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. నాకు ఆ ప్రదేశమంతా తెలుగుతనం తో ఉన్నట్టు ఉండేది. నేను US వచ్చాక ఇల్లు చాల బోసిగా అనిపించేది.ఇంక లాభం లేదని ఆ ప్రింట్స్ కోసం ప్రయత్నించాము.అదృష్టవసాత్తు నాకు http://bapuart.com/ కనపడింది. ఇందులో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి కొంత సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది . విజయవాడ లోని impressions సంస్థ వారికి ఈ ప్రింట్స్ మీద హక్కులు ఉన్నాయి.ఒక వారాంతం వారికి ఫోన్ చేసి మాకు ఆ ప్రింట్స్ కావాలని అడిగిన వెంటనే వారు మాకు కావలిసిన బొమ్మల జాబితా ఇంకా కావలిసిన కొలత తెలియచేస్తూ impressionsoffice (at) yahoo [dot] co [dot] in కి  ఒక సందేశం పంపమని చెప్పారు.మేము కొన్ని ప్రింట్స్ 30″x40″ (ఫ్రేమ్ లేకుండా)  కావాలని సందేశం పంపాము.అన్ని సిద్ధం చేసి మా స్నేహితుడు ఇండియా వెళ్ళినప్పుడు ఆయనకు courier చేశారు, వీలుంటే విజయవాడ ఆఫీసు లో అయినా తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవి తీసుకు రావడానికి  వీలుగా చక్కగా అమర్చి ఒక ట్యూబ్ లో ఉంచారు.అవి చాల సురక్షితంగా మాకు చేరాయి.ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది.ఇక్కడ అన్ని ఫ్రేమ్స్, మేము చూసినవి 27″X30″ కొలతలోనే ఉన్నాయి.అవి కాకుంటే ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది . బాగా ఆలోచించి ఆ ప్రింట్స్ ని బొమ్మ పాడవకుండా 27″X30″ కి కుదించి ఇక్కడ దొరికిన ఫ్రేమ్ లో మొత్తానికి చాల కష్టపడి బిగించాము. ఇంట్లో అవి తగిలించేసరికి ఇంటికి ఎంత కళ వచ్చిందో!!!! ఆ రోజు వచ్చిన స్నేహితులైతే అవి చూసి చాలా ఆనందపడ్డారు. తెప్పించుకునే ముందు మీకు దగ్గర లో వున్న క్రాఫ్ట్స్  స్టోర్ లో ఫ్రేమ్ ఎంచుకుని దానికి తగ్గ కొలతలో ప్రింట్స్ తెప్పించుకోండి.

Advertisements

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ బిల్ల్ ఆఫ్ రైట్స్


ఆ మధ్య ఒక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆరు నెలలు ఉచిత బాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫర్ అంటే ఇదేదో బానే వుంది కదా అని ఒక 2% కట్టి కొంత మొత్తం కొత్త కార్డ్ కి బదిలీ చేసా. ఆ తరువాత కొన్ని నాళ్ళకి ఒక వారాంతం స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్య బాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రస్తావన వచ్చినప్పుడు తను ఎందుకు ఏమిటో తెలియదు కాని ఒక సారి బదిలీ చేసినాక ఇక ఆ కార్డ్ వాడకూడదు అని చెప్పాడు. ఎందుకైనా మంచిది ఒక సారి నీ స్టేట్మెంట్ సరి చూసుకో అని చెప్పాడు. సరే కదా అని చూస్తే ఫైనాన్స్ ఛార్జ్ అని కొంత మొత్తం కట్టాలని వుంది అందులో. ఫోను చేస్తే అవతల పెద్ద మనిషి మీరు చేసిన కొనుగోళ్లకు అది వడ్డీ అన్నాడు. నేను చేసిన కొనుగోళ్లకు సరి పడా తిరిగి చెల్లించాను కదా అని నేను అంటే, నేను చెల్లించిన మొత్తం వడ్డీ తక్కువ వున్న బాకీ ఏదైతే వుందో దానికి జమ కడతామని, అది మొత్తం చెల్లించిన తరువాతే నేను కట్టినది ఎక్కువ వడ్డీ వున్న బాకీకి జమ చేస్తామని, అప్పటి వరకు చచ్చినట్టు వడ్డీ కట్టాల్సిందేనని చెప్పాడు. ఉదాహరణకు నేను ఒక ౩౦౦౦ బదిలీ చేసి ఒక ౩౦౦ కొనుగోలు చేశాను అనుకోండి, ౩౦౦౦ కట్టిన తరువాతే ౩౦౦ తీర్చగలను అన్న మాట. కొనుగోలు దారు జాగ్రత్త, ఉచితం అంటూ ఏమీ వుండదు లాంటి ఉపదేశాలు గుర్తు వచ్చి ఎక్కువ మాట్లాడకుండా ఫోను పెట్టేసాను (ఈ విషయం వారు నాకు ఇది వరకే చెప్పి వున్నారని అందుకు నేను అంగీకరించాను అని కూడా అన్నాడు!). అదృష్టవసాత్తూ చేతిలో డబ్బులు వుండటంతో మొత్తం కట్టేసాను.

ఇదంతా ఇక్కడ చెప్పటానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి నా లాంటి అమాయక చక్రవర్తుల (బుర్ర తక్కువ వెధవలు) ఎవరన్నా ఇది చదివి ఇలాంటి తప్పిదం చెయ్యకుండా వుంటారని. రెండు ఈ వార్తలు చూసి ఆనందం పట్టాలేకా –

At the urging of the president, the House amended the bill to mandate the disclosure on each credit card bill of the long-term costs of paying only the minimum balance. Another provision requires credit card issuers to apply payments over the minimum balance to the debt with the highest interest rate first. Both were accepted by voice vote.

Congress turns from bank bailouts to helping consumers

Bills, Fed rules on credit cards

Who is Complying With New Credit Card Rules? An Update

Credit Card Bill of Rights: Which cards are complying?

నాణానికి మరో వైపు.

ఈ వార్తలు చూసి భయం వేసింది –

Credit Information Bureau (India) Limited

CIBIL, TransUnion launch generic credit score

How High Is Your Score?

సమ్మర్ 2007


చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. మొదట్లో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా, చివరలో కొంచెం సాగతీసినట్టు అనిపించినా, ముగింపు మింగుడు పడక పోయినా, మొత్తానికి చూడవలసిన చిత్రం. రంగ్ దే బసంతి అంత బాగా ఆడటానికి ఈ చిత్రం మరుగున పడిపోవటానికి కారణాలు ఏంటో. అషుతోష్ రాణా అద్భుతంగా నటించాడు. కేవలం ఆ ఒక్క పాత్ర కోసం అయినా ఈ చిత్రం చూడవచ్చు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో ఇంకేమన్నా మంచి చిత్రాలు వచ్చాయా? ఇంత తీవ్ర సమస్యని మీడియా ఎందుకు పట్టించుకోవటం లేదు? మారుతున్న ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో చిన్న రైతుకు స్థానం లేదా?

చిత్రం సమీక్ష ఇక్కడ.

PS: focus, highlight, ignore, neglect వీటికి తెలుగు పదాలు చెప్పరూ