నా తొలి టపా


‘నా ప్రస్థానం’ లో బాపు గారి బొమ్మల గురించి తొలి టపా రాయటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి నేను ఆయన బొమ్మలకు, సినిమాలకు అభిమానిని. ఎందుకో అన్ని చాలా సహజంగా అనిపించేవి. విజయవాడ లో ప్రతి సంవత్సరం పెట్టే పుస్తక ప్రదర్సన లో ఆయన బొమ్మల కొలువు కూడా ఉండేది. అది చూడడమంటేనే చాలా పండుగలా ఉండేది.మా బంధువుల ఇంట్లో ఆయన పైన్టింగ్స్ వి ప్రింట్స్ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. నాకు ఆ ప్రదేశమంతా తెలుగుతనం తో ఉన్నట్టు ఉండేది. నేను US వచ్చాక ఇల్లు చాల బోసిగా అనిపించేది.ఇంక లాభం లేదని ఆ ప్రింట్స్ కోసం ప్రయత్నించాము.అదృష్టవసాత్తు నాకు http://bapuart.com/ కనపడింది. ఇందులో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి కొంత సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది . విజయవాడ లోని impressions సంస్థ వారికి ఈ ప్రింట్స్ మీద హక్కులు ఉన్నాయి.ఒక వారాంతం వారికి ఫోన్ చేసి మాకు ఆ ప్రింట్స్ కావాలని అడిగిన వెంటనే వారు మాకు కావలిసిన బొమ్మల జాబితా ఇంకా కావలిసిన కొలత తెలియచేస్తూ impressionsoffice (at) yahoo [dot] co [dot] in కి  ఒక సందేశం పంపమని చెప్పారు.మేము కొన్ని ప్రింట్స్ 30″x40″ (ఫ్రేమ్ లేకుండా)  కావాలని సందేశం పంపాము.అన్ని సిద్ధం చేసి మా స్నేహితుడు ఇండియా వెళ్ళినప్పుడు ఆయనకు courier చేశారు, వీలుంటే విజయవాడ ఆఫీసు లో అయినా తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవి తీసుకు రావడానికి  వీలుగా చక్కగా అమర్చి ఒక ట్యూబ్ లో ఉంచారు.అవి చాల సురక్షితంగా మాకు చేరాయి.ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది.ఇక్కడ అన్ని ఫ్రేమ్స్, మేము చూసినవి 27″X30″ కొలతలోనే ఉన్నాయి.అవి కాకుంటే ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది . బాగా ఆలోచించి ఆ ప్రింట్స్ ని బొమ్మ పాడవకుండా 27″X30″ కి కుదించి ఇక్కడ దొరికిన ఫ్రేమ్ లో మొత్తానికి చాల కష్టపడి బిగించాము. ఇంట్లో అవి తగిలించేసరికి ఇంటికి ఎంత కళ వచ్చిందో!!!! ఆ రోజు వచ్చిన స్నేహితులైతే అవి చూసి చాలా ఆనందపడ్డారు. తెప్పించుకునే ముందు మీకు దగ్గర లో వున్న క్రాఫ్ట్స్  స్టోర్ లో ఫ్రేమ్ ఎంచుకుని దానికి తగ్గ కొలతలో ప్రింట్స్ తెప్పించుకోండి.

Advertisements

2 thoughts on “నా తొలి టపా

  1. స్వాగతం.నేను కూడా బాపుగారి అభిమానినే, అయినా ఆయన అభిమానులు కాని తెలుగువాడుండడేమో.ఆయనపై ఉండే అభిమానాన్నిఆయన బొమ్మల్ని వేయడంలో వ్యక్తపరచుకుంటూ ఉంటాను.ఒకసారి నా బ్లాగును చూడండి. లీలామోహనం http://vijayamohan59.blogspot.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s