దీపం


అన్ని అవయవాలు లక్షణంగా పనిచేస్తేనే మనకు కొన్ని పనులు చెయ్యడం కష్టంగా ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఒక సభ లో అంధ విద్యార్ధుల గురించి ఒక presentation చూసాను.ఒక అంధుడైన వ్యక్తి ఎంతో పట్టుదల తో నిధులు సరిపడా లేకున్నా ప్రభుత్వ సంస్థల కంటే ఎంతో  ఉన్నతంగా అంధుల కోసం ఒక ప్రాధమిక పాఠశాలను నడుపుతున్నారు. 8 మందితో మొదలయ్యింది ఇప్పుడు 250 కి ఆశ్రయం ఇస్తోంది. అంధులను చూసి అవిటివాళ్ళు అని జాలి పడకుండా వాళ్ళకి సొంత కాళ్ళమీద నిలబడే ధైర్యం ఇస్తున్న ఆ సంస్థ మీద ఎంతో గౌరవము ఏర్పడింది.అక్కడి పిల్లల ప్రతిభా పాటవాలు చూస్తే ఎంతో ముచ్చటేసింది.ఆ సంస్థను నడిపే ఆయన ఆశయం గొప్పది , దానికి ఉడతా భక్క్తి గా మనం ఏదైనా సహాయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదు అనిపించింది. ఈ టపా ను చదివే వారికి నాదొక విన్నపం. ఈ లింక్ ను ఒకసారి చూడండి http://www.helpblind.org. మీకు తోచింది చెయ్యండి.ఇది చూసాక “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అన్న నానుడి కంటే  అన్ని ధర్మ కార్యాలలోకి తమ స్వశక్తిని పెంపొందించే ఇలాంటి సంస్థలు చాలా అవసరం అనిపించింది.

Advertisements

తెలుగునాడి


తెలుగునాడి

అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?

పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

అక్షరం-తలదించుకున్న-వేళ

మంచి గుణపాఠమే

నా వరకు నాకు తెలుగునాడి అమితంగా నచ్చింది. ఇక ముందు అది వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు తెలిసి అమెరికా లో అచ్చులో లభించే మంచి తెలుగు పత్రికలు ఏమన్నా వున్నాయా?

ద్రాక్షారం కథలు (హాస్య కథలు)


నా జీవితానంతరం మరికొన్నాళ్ళు నన్ను సజీవుడిగా ఉంచుతుందన్న సంకల్పంతో యీ సంకలనాన్ని సమర్పిస్తున్నాను అని ఫినిషింగ్ టచ్ లో చెప్పారు డా|| దవులూరి శ్రీకృష్ణ మోహన రావు గారు. కొన్నాళ్ళు కాదు చాన్నాళ్ళు అని నేనంటాను. ఈ కథలు చదివితే అందమైన పల్లెటూరికి వెళ్ళినట్టే అంటారు ఎల్బి. శ్రీరాం గారు. ఎంతో పరిచయం ఉండి – పరిసరాల్తోటి.. మనుష్యులతోటి మమేకం అయితే తప్ప ఇలాంటి కధలు పుట్టవు అంటారు తనికెళ్ళ భరణి గారు. సరదాగా నవ్విస్తూనే ఎంతో లోతుగా గోదావరి ప్రాంత జన జీవితాల్లోకి తొంగి చూస్తాయి ఈ కధలు. నన్నడిగితే పసలపూడి కధలకి ఏ మాత్రం తీసిపోవు ఈ ద్రాక్షారం కథలు. మరి ద్రాక్షారం కథలకి ఏ మాత్రం తీసిపోవు పసలపూడి కథలు అని ఎందుకు అనలేదు? పసలపూడి కథలు రాసింది వంశి కాబట్టి. ఆయన పెద్ద సినిమా డైరెక్టరు కాబట్టి. ఆ కథలు స్వాతి లో వచ్చాయి కాబట్టి. ఆ కథలు అందరికి తెలుసు కాబట్టి. ద్రాక్షారం కథలకి కూడా అంత వెలుగు రావాలని, అంతగా అమ్ముడు పోవాలని, రచయితకు అంత పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అంత మంచి కథలు చెప్పినందుకు నా కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

సూర్రావు వీలునామా ఎంత దిట్టంగా వుందో, చందర్రావు వీలునామా కూడా అంత దిట్టంగానే వుంది. అదే తేదీన వుంది.
సూర్రావు, చందర్రావులవి ఎదురిళ్ళు కనుక అరుగుల మీద నిలబడి నీది నకిలీ అంటే నీది నకిలీ అని తిట్టుకున్నారు.
మా కోమట్ల ఫైటింగులు ఎలా ఉంటాయంటే “ఇద్దరూ లమ్డీకొడుకులైపోతారు . అటు ఏడు తరాలు, యిటు ఏడు తరాలు నాసనమైపోతాయి, సొంత అన్నదమ్ములైనాసరే. పీకలు తెగిపోతాయి రక్తం ఏరులైపారుతుంది. కాళ్ళు మాత్రం వీధరుగులు దిగవు.