కొండకింద కొత్తూరు


కొండకింద కొత్తూరు

మధురాంతకం నరేంద్ర

ప్రధమ ముద్రణ : జూన్ 2015

అలకనంద ప్రచురణలు

విజయవాడ

ఈ నవల 2009లో ఆంధ్రభూమి దినపత్రికలో గమ్యమూ – గమనమూ అనే పేరుతో సీరియల్ గా వచ్చింది. తిరుపతికి దగ్గర ఉన్న ఒక పల్లెటూరులో పెద్దగా పని లేని యువకుల చుట్టూ తిరుగుతుంది ఈ నవల. రెండు కీలక సంఘటనలు తప్ప మిగతా పుస్తకం అంతా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో పేకాట ఆడాలి, రాజకీయాల్లోకి ఎలా చొరబడాలి అనే సమస్యల చుట్టూ తిరుగుతుంది కథ. మొదట్లో ఇదేంటి ఎంతసేపు ఇదే గోలా అనిపించినా తరువాత తరువాత రచయిత ఎందుకు అంతసేపు కథను ముందుకు నడపలేదో అర్థమవుతుంది. ఆ ఊరిని, ఆ ఊరి మనుషులని, ఆ ఊరి పరిస్ధితులని పూర్తిగా పాఠకుడి అవగాహనలోకి తీసుకువచ్చే ప్రయత్నం అని తరువాత అర్ధమవుతుంది.

ముందుమాట వ్రాసిన బండి నారాయణస్వామి గారు, ఆఫ్టర్ వర్డ్ వ్రాసిన అఫ్సర్ గారు ఈ నవలలో నేను చదివినప్పుడు నాకు అందని ఎన్నో ప్రతీకలను(కూలాలు, రాజకీయ వ్యవస్థ, పట్టణీకరణ) వివరించారు. నా వరకు పుస్తకం చదువుతున్నంత సేపు నేను చిన్నప్పుడు మా తాతగారి ఊరులో గడిపిన రోజులను జ్ఞప్తికి తెచ్చాయి. ఆలోచించుకుంటే నిజానికి నేను ఎవరు అన్నది కానీ, నేను ఏం చేస్తున్నాను అని కానీ యిప్పుడు ఏ ఊరులోనూ ఎవ్వరికీ పట్టని విషయం. ప్రపంచం అలా ఎలా మారిపోయింది? చిన్నప్పుడు ఊరులో ఇంట్లో నుండి అడుగు బయట పెడితే ఎవరో ఒకరు పలకరించేవారు. ఆరా తీసేవారు. హాస్యమాడేవారు. మంచి చెప్పేవారు. ఏదన్నా అల్లరి చేయాలన్నా ఎవరు చూస్తారో ఏమనుకుంటారో అనే భయం ఉండేది. ఒక సామాజిక జీవనాన్ని కోల్పోయి ఒంటరివాడిని అయిపోయానే అనిపించింది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నేను బాగా ఆస్వాదించింది ఆ ఎకసెక్కాలను, ఆసూయలనూ, అమాయకత్వాన్ని, సోంబేరితనాన్ని. భయపడింది సమాజంలో మంచి కన్నా చెడుకు పెరుగుతున్న విలువను, గౌరవాన్ని చూసి.

ఈ పుస్తకం గురించి రచయిత మాటల్లో –