రెక్కల ఏనుగులు


బాలరంజని రెక్కల ఏనుగులు (ఇంకొన్ని బాలల కథలు)

ఆర్. శాంతసుందరి

ISBN: 978-81-920541-6-2

జె.పి. పబ్లికేషన్స్

నది మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన 25 కథల సమాహారం ఈ పుస్తకం.

గురుకులంలో దొంగతనం చేస్తూ పట్టుబడిన విద్యార్థి విషయంలో గురువుగారు ఏం నిర్ణయం తీసుకున్నారు?

కప్పకి సంగీతం నేర్పాలని ప్రయత్నించిన కోకిలకి ఏమయింది?

అదృష్టదేవత గొప్పదా జ్ఞానదేవత గొప్పదా?

కత్తులు కాని కత్తులు వెయ్యి కావాలి, వంతెన కాని వంతెన దాటాలి, నీరు కాని నీరుతోనే ఓడించాలి అని చెప్పిన రాక్షసుడిని ఓడించటం ఎలా?

ఒక పాత్రలో రాళ్ళూ, గులకరాళ్లు, ఇసుక నింపి గురువుగారు శిష్యులకు ఏమి బోధించారు?

ముఖ్యమైన సమయం ఏది? ముఖ్యులు ఎవరు? ముఖ్యమైన కార్యం ఏది?

ఇలాంటి తెలివైన చిన్న కథలు ఈ చిన్న పుస్తకంలో ఎన్నో. ప్రతి కథకి ఒక అందమైన బొమ్మ. నా చిన్నతనంలో యిలాంటి కథల పుస్తకాలు గ్రంధాలయంలో చాలా ఉండేవి. ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ పుస్తకం తప్పకుండా చదివించండి. లేకపోయినా తప్పకుండా కొని చదవండి.

రచయిత్రికి, నది మాసపత్రిక వారికి, ప్రచురణకర్తకు నమస్సులు.

Leave a comment